logo

బ్యాట్ తో విరాట్.. బంతి తో భువి..


12-Aug-2019 10:24IST
virat bhuvi help india to take lead

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్ తో (120; 125) బంతుల్లో 14×4, 1×6), భువనేశ్వర్‌ కుమార్‌ బంతితో (4/31) చెలరేగిన వేల వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడి ఆటంకం కారణంగా మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించి విండీస్‌ లక్ష్యాన్ని 270 పరుగులుగా నిర్దేశించారు. టీమిండియా బౌలర్ల ధాటికి వెస్టిండీస్‌ పోరాటం 42 ఓవర్లలో 210 పరుగుల వద్దే ముగిసింది. ఓపెనర్‌ ఎల్విన్ లూయిస్‌(65; 80బంతుల్లో 8×4, 1×6), పూరన్‌(42; 52బంతుల్లో 4×4, 1×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. భారత బౌలరల్లో షమి(2/39), కుల్దీప్‌(2/59) రాణించగా, కెప్టెన్ విరాట్ మూడు క్యాచ్ లు అందుకోవడం విశేషం. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(71; 68బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా.. మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది. 

కాగా ఈ మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి

* వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన పాక్‌ మాజీ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌(64 ఇన్నింగ్స్‌లో 1930 పరుగులు) పేరిట ఉన్న 26 ఏళ్ల రికార్డును కోహ్లీ(35 ఇన్నింగ్‌ల్లో 2032) తాజాగా బద్దలు కొట్టాడు. 
* వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ల జాబితాలో కోహ్లీ(11,406) రెండో స్థానానికి చేరుకున్నాడు. సచిన్‌(18,426) అతని కంటే ముందు ఉన్నాడు.
* వెస్టిండీస్‌ తరఫున అత్యధిక వన్డేలాడిన క్రికెటర్‌గా క్రిస్‌ గేల్‌(300) ఘనత వహించాడు. గతంలో ఈ రికార్డు విండీస్ ఆల్ టైం గ్రేట్ బ్రయాన్‌ లారా (299) పేరిట ఉండగా, ఈ మ్యాచ్ లో గేల్ ఆ రికార్డు ను చెరిపేసాడు. 
* వన్డేల్లో వెస్టిండీస్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా గేల్‌(10,353) అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు బ్రయన్‌ లారా(10,348) పేరిట ఉండేది. 

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter 

Tags: Virat Kohli Bhuvneshwar Kumar India tour of West Indies 2019 India national cricket team

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top