logo

పసుపు వల్ల చర్మానికి కలిగే లాభాలు ఎన్నో..


12-Aug-2019 10:38IST
turmeric beauty tips

పసుపు అంటే వెంటనే అందరు యాంటిబయాటిక్ అంటారు. మనకు ఎక్కడైనా గాయాలై రక్తం కారుతున్న ప్లేసులో ఈ పసుపును పెడితి అది పుండు అవ్వకుండా తొందరగా మానుతుంది. అలాజె మనకు జలుబు అలాంటి అనారోగ్య సమస్యలు కనుక వస్తే గ్లాసుడు పాలల్లో చిటికెడు పసుపు కనుక వేసుకొని తాగితే జలుబు మాయమవుతుంది. ఇకపోతే ఈ పసుపును వంటల్లో కలర్ కోసం వాడుతున్నాం అని చాలా మంది అంటారు. కానీ , ఈ పసుపును కేవలం కలర్ కోసమే కాదు, కడుపులో ఉండే నులిపురుగులను కూడా ఈ పసుపు వల్ల  చనిపోతాయి. అటువంటి పసుపును ఉపయోగించి చర్మాన్ని ఏ విదంగా మెరుగులు దిద్దుకోవచ్చొ ఇప్పుడు చూద్దాం..

1. పసుపుతో పేస్ ప్యాక్ :

Image result for pasupu face pack

పసుపు ఒక స్పూన్ తీసుకోని, అందులో కొద్దిగా నీళ్లను వేసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకొని పది నిమిషాల తర్వాత కడిగేసుకొని, లైట్గా షొప్ పెట్టుకొని ముఖాన్ని కడిగేసుకోవాలి. చర్మం కాంతిగా మారుతుంది అలాగే మృతకణాలు తొలగిపోతాయి. 

2. పసుపు, పాలతో పేస్ ప్యాక్ :

Image result for pasupu and milk face pack

ఒక స్పూన్ పచ్చి  పాలను తీసుకోని, అందులో చిటికెడు పసుపు వేసుకొని పేస్ కి ఆప్లె చేసుకొని, ఆరాక కడిగేసుకోవాలి అంతే మృదువైన చర్మం మీ సొంతం

3. పసుపు, తేనే :

Image result for pasupu and honey

అర స్పూన్ పసుపుకు , ఒక స్పూన్ తేనే తీసుకోని  ఆ రెండింటిని బాగా కలుపుకోవాలి. తరువాత ముఖాన్ని నీటితో కడిగేసుకొని ముఖానికి రాసుకొని పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. అంతే మృదువైన, తెల్లని చర్మం మీసొంతం. 

4. పసుపు , టమోటా:

Related image

ఒక స్పూన్ టమోటా గుజ్జులో చిటికెడు పసుపు , కొద్దిగా మీగడ వేసుకొని కనుక ముఖానికి రాసుకుని ఆరాక కడిగేసుకోవాలి..  చర్మం మెరవడమే కాదు.. మృదువుగా కూడా తయారవుతుంది. ఈ ప్యాక్ ను వారానికి మూడు సార్లు కనుక వేసుకుంటే చర్మం రంగుతో తొందరగా తెల్లని రంగును పొందుతుంది. 

5. పసుపు , గంధం :

Image result for pasupuand sandalwood

చిటికెడు పసుపుకు, ఒక స్పూన్ గంధం వేసుకొని, అందులో రోజ్ వాటర్ ను కనుక యాడ్ చేసుకొని ముఖానికి ప్యాక్ లాగా వేసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. 

చూసారుగా వంటింట్లో ఉండే పసుపుతో చర్మం రంగును పెంపొందిచుకోవచ్చునో.. మీకు ఈ టిప్స్ నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి...

Tags: turmeric easy face packs homemade face packs turmeric beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top