logo

'కొత్త ఫీచర్స్'తో అదరగొడుతున్న జియో 3 ఫోన్


12-Aug-2019 11:08IST
jio 3 gigafiber phone has special futures

ప్రతి ఏటా రిలయన్స్ నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో నూతన ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆగష్టు 12న జరగనున్న రిలయన్స్ వార్షిక సమావేశంలో జియో 'ఫోన్ 3' 4జీ ఫీచర్ ఫోన్‌ను టెలికాం సంస్థ రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో వచ్చిన జియో 4జీ ఫీచర్ ఫోన్లతో పోలిస్తే జియో ఫోన్ 3లో నూతనంగా టచ్ సదుపాయం ఉన్న ఐదు అంగుళాల HD స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా 2 జీబీ ర్యామ్‌తో 16 జీబీ అంతర్గత స్టోరేజీ ఈ ఫోన్లో పొందుపరిచారు. ఇక దీంతోపాటు వాయిస్, వీడియోకాల్స్‌ను మరింత మెరుగ్గా అందించేలా పలు నూతన సదుపాయాలను కూడా జియో ఫోన్ 3లో అందిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడక తప్పదు.

Tags: jio 3 gigafiber phone special futures reliance mukesh ambani

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top