logo

ఈద్ ఉల్ అధా ముబారక్


12-Aug-2019 11:28IST
eid ul adha

ముస్లింలు జరుపుకునే పండుగలలో రంజాన్ అతి ముఖ్యమైనది కాగా, బక్రీద్ రెండవది. ఇస్లామిక్ క్యాలెండర్  ప్రకారం చివరి నెల అయిన జిల్ హజ్ 10వ రోజున బక్రీద్ ను జరుపుకుంటారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్ధం. బకర్ అంటే గొర్రె , ఈద్ అంటే పండుగ అని వివరణ. దీనికే ఈద్ ఉల్ అధా అని మరో పేరు. ఈ పండుగ రంజాను మాసం తర్వాత వచ్చే రెండో నెలలో ఖచ్చితంగా వస్తుంది.
 
ఇది హజ్ ముగింపుకు సూచన అని ముస్లిముల నమ్మకం. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా వెళ్లాలని కోరుకుంటారు. ఈ నెల ప్రారంభంలోనే ముస్లింలు  భక్తి శ్రద్దలతో హజ్ తీర్థయాత్రకు వెళ్తారు.సౌదీ అరేబియాలో ఉన్న హజ్ కు వెళ్ళినవారు స్జిద్..ఉల్..హరామ్‌లోవున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

బక్రీద్ చరిత్ర : 
ఖురాన్ ప్రకారం.. . అల్లాహ్ పంపిన ప్రవక్తలలో ఇబ్రహీం ఒకరు. తాను మక్కా పట్టణాన్ని నిర్మించడమే కాకుండా అల్లా ఆరాధనా కోసం కాబా అనే మసీద్ కూడా నిర్మించి దేవుని ప్రవక్తగా పేరు పొందాడు. ఒకరోజు అబ్రహంకు ఒక కల వచ్చింది.10 సంవత్సరాలు ఉన్న తన కుమారుడు ఇస్మాయిల్ ను బలి  ఇస్తున్నట్టు తనకు కల వచ్చింది. అల్లాహ్ బలి  కోరాడు అని ఒక ఒంటెను బలి  ఇచ్చాడు.అయినా మరుసటి రోజు అదే కల వచ్చింది. ఇక తన కుమారుడుని బలి  కోరాడు అనుకుని,  అల్లాహ్ పైన ఉన్న అపారమైన భక్తి తో తాను తన కుమారుడిని బలి ఇవ్వాలనుకున్నాడు.తన త్యాగానికి ప్రసన్నుడై  దేవుడు తన దేవదూతలో జిబ్రయీల్ అనే దూతను పంపించి తన కుమారుడికి బదులుగా తనకి ఇష్టమైన ఒక జంతువును బలి ఇవ్వమని కోరారు. ఆరోగ్యకరంగా ఉండే అవయవలోపం లేని ఒక ఒంటె, మేక లేక గొర్రెని బలి ఇవ్వమని సూచించారు. ఆ నాటి నుండి బక్రీద్ నాడు ఖుర్భాను ఇవ్వడం ప్రతీకగా వస్తుంది. 

కావున, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ముస్లింలు అల్లాహ్ పట్ల తమకున్న భక్తిని, ప్రేమను నిరూపించుకోవడానికి తమకు ప్రియమైన జంతువును బలి ఇస్తారు. అల్లాహ్ నిబంధనల ప్రకారం ఖుర్భానిగా కోడిపుంజుని బలి  ఇవ్వరాదు. ఐదేళ్ల వయసు పైబడిన ఒంటె, రెండేళ్ల పై ఉన్న ఆవు లేక కనీసం ఏడాది వయసున్న మేక లేదా గొర్రెను బలి  ఇవ్వాలి. ఖుర్భా అంటే సమర్పణ, త్యాగం అని అర్ధం. అందుకే బక్రీద్ నాడు విందును మూడు భాగాలుగా విభజిస్తారు.ముందుగా ఒకటి కుటుంబం, స్నేహితులు, పొరుగువారి కోసం, రెండవ భాగం పేదలు, పేదవారికి పంపిణీ చేస్తారు. ఇక మూడవ భాగం తక్షణ కుటుంబం కోసం ఉంచుకుంటారు. ఈ బక్రీద్ పండుగ ఒక త్యాగానికి ప్రతీగా జరుపుకునే ముస్లిం సోదరులందరికి బక్రీద్ శుభాకాంక్షలు. 

Tags: Eid ul Adha Mubarak bakrid 2019 Bakrid wishes bakrid mubarak

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top