కౌలాలంపూర్ లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్
2008 లో భారత క్రికెట్ జట్టు కు విరాట్ కోహ్లీ రూపంలో ఒక ఆణిముత్యం లభించింది. సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ లాంటి హేమాహేమీలతో కిక్కిరిసిన అప్పటి భారత జట్టులో చోటు సంపాదించడమంటే ఆషామాషీ విషయం కాదు. అటువంటి సందర్భం లో భారత జట్టులో స్థానం సంపాదించాడు విరాట్ కోహ్లీ. అతనిలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని పసిగట్టిన టీం మేనేజ్ మెంట్ అతనికి తగినన్ని అవకాశాలిచ్చి అతన్ని ప్రోత్సహించింది. తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. జట్టులో సాధారణ ఆటగాడి స్థాయి నుంచి ఇండియన్ క్రికెట్ అల్ టైం గ్రేట్ క్రికెటర్స్ సరసన చేరాడు. లండన్ లోని మేడం టుస్సాడ్స్ మ్యూసియం లో అతని మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేంత స్థాయికి అతని కీర్తిప్రతిష్టలు పెరిగాయి. చాలా కొద్ది మంది క్రికెటర్స్ కు మాత్రమే లభించే ఈ గౌరవం కోహ్లీకి చాల కొద్దికాలం లోనే దక్కింది. ఇక సంపాదన పరంగా చూసినా ఫోర్బ్స్ జాబితాలో క్రికెట్ విభాగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు.
30 సంవత్సరాల ఈ ఢిల్లీ క్రికెటర్, కెరీర్ అప్రతిహాసంగా కొనసాగుతుంది. అన్ని ఫార్మాట్ లలో అగ్రభాగాన నిలుస్తూ, జట్టుని విజయవంతంగా నడిపిస్తున్నాడు. టెస్టుల్లో ధోని రిటైర్మెంట్ తర్వాత జట్టు పగ్గాలు చేప్పట్టిననాటి నుంచి భారత జట్టుకు అన్ని తానై ముందుండి నడిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో కోపిష్టిగా ముద్ర పడ్డా, తర్వాత పరిణితి చెంది తన పంధా ను మార్చుకున్నాడు. సినీ నటి అనుష్క శర్మ ను పెళ్లాడిన కోహ్లీ, మైదానంలోనే కాదు అన్ని రంగాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
నిన్నటి 42వ వన్డే సెంచరీ వరకు కెరీర్ లో ఎన్నో రికార్డు లను తిరగరాశారు. ఎవరికీ సాధ్యం కానీ కొన్ని అరుదైన రికార్డు లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుత క్రికెట్ లో, అల్ టైం గ్రేట్ సచిన్ రికార్డులను తిరగరాసే సత్తా ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్ లో కూడా రాణిస్తున్నాడు, కానీ తన నాయకత్వం లోని జట్టుని విజయతీరాలకు చేర్చలేకున్నాడనే అపవాదుని మోస్తున్నాడీ సక్సెస్ ఫుల్ క్రికెటర్. టెస్టుల్లో 77 మ్యాచ్ ల్లో 6613 పరుగులు చేసాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి. ఇక 238 వన్డేల్లో 42 సెంచరీల తో 11406 పరుగులు చేసాడు. టీ 20ల్లో 70 మ్యాచ్ ల్లో 2369 పరుగులు చేశాడీ రన్ మెషిన్ గన్. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరికి అందనంత ఎత్తులో కోనసాగుతుందీ విరాటుని పర్వం.