logo

కోహ్లీ ' బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ' అదుర్స్


12-Aug-2019 12:40IST
kohli bottle cap challenge gone viral

సోషల్ మీడియాలో ఛాలెంజ్ ల జమానా నడుస్తున్న వేళ ' బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ' కు ఎంతో ప్రాచుర్యం లభించింది. ఇటీవలి కాలంలో చాలా మంది సెలెబ్రిటీలు ఈ ఛాలెంజ్ ను టేకప్ చేయడంతో, దీనికి మంచి పాపులారిటీ లభించింది. తాజాగా విరాట్ కోహ్లీ ఈ ఛాలెంజ్ ను టేకప్ చేసాడు. కోహ్లీ మాత్రం అందరికి భిన్నంగా బ్యాట్‌తో షాట్‌ ఆడి బాటిల్‌ క్యాప్‌ను ఓపెన్‌ చేశాడు. దీనికి టీమిండియా కోచ్ రవి శాస్త్రి, బ్యాక్ గ్రౌండ్ కామెంట్రీ చెప్పడంతో మరింత వైరల్ అయ్యింది. 

ఏం నైపుణ్యం, మణికట్టు సాయంతో ఫ్లిక్,  బంతి అలా వెళుతోంది, భలే షాట్‌’ అంటూ శాస్త్రి చేసిన వ్యాఖ్యానం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ‘ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేశా’ అని క్యాప్షన్ పెట్టి, దానికి సంబందించిన వీడియో ను ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. కోహ్లీ ఫీట్ కు రవిశాస్త్రి వ్యాఖ్యానం తోడవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇంతకు ముందు క్రికెటర్లు యువరాజ్‌, శిఖర్‌ ధవన్‌ కూడా ఈ బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో పాల్గొన్నారు. 

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter  





Tags: kohli bottle cap challenge gone viral

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top