logo

అరటి బజ్జిలు చేసుకోవడం ఎలా..


12-Aug-2019 12:45IST
banana bajjis easy preparation method

అరటి.. ఇది పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఏ పూజలో చూసిన కూడా అరటి కనిపిస్తూ ఉంటుంది. పండువాటిని అలాగే తింటారు. పచ్చి వాటిని కూరల్లో వాడుకుంటారు. కొందరేమో కూరలు కాకుండా సైడ్ డిష్ గా స్నాక్స్ కూడా చేసుకుంటారు. అలా స్నాక్స్ చేసుకొనే వాళ్ళు అరటి కాయలతో బజ్జిలను చేసుకోవడం ట్రై చెయ్యండి. రుచికరమైన ఈ అరటి బజ్జిలను ఎలా చేసుకోవాలో చూద్దాం.. 

కావలిసిన పదార్థాలు:

అరటి కాయలు    : రెండు 
నూనె                  : డీ ఫ్రై చేసుకోవడానికి సరిపడా 
ఉప్పు                 : సరిపడా 
కారం                  : ఒక టేబుల్ స్పూన్ 
ధనియా పౌడర్    : కొద్దిగా 
బేకింగ్ సోడా        : చిటికెడు 
వాము                : అర స్పూన్ 
శనగ పిండి         : పావు కిలో 

తయారీ  విధానం :

 ముందుగా ఒక బౌల్ తీసుకోని అందులో శనగ పిండి వేసుకొని, సరిపడా ఉప్పు , కారం, వాము , ధనియా పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని  నీళ్లు పోసుకొని జారుడుగా , బజ్జిలను వేసుకోవడానికి సరిపడినంతగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటి కాయలను తీసుకోని పైన తోలుని తీసేసి, నిలువు ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, ఫాన్ పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని కాగాకా, ఈ అరటి ముక్కలను బజ్జిల పిండిలో ముంచి నూనెలో వేసి , గోల్డెన్ రంగు  వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచి కరమైన అరటి బజ్జిలు రెడీ. వీటిని టమోటా సాస్ లేదా గ్రీన్ చట్నీ కాంబినేషల్లో తింటే, ఆ రుచిని ఇంకా మరువరేమో.. ఈ రుచికరమైన అరటి బజ్జిలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చెయ్యండి.. 

Tags: banana banana bajjis easy preparation

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top