logo

కీరదోసతో కిడ్నీలో సమస్యలు దూరం..


12-Aug-2019 14:02IST
benifits of cucumber

కీరదోస.. రుచికి చప్పగా ఉన్న కూడా ఎన్నో రకాలుగా మనకు మేలు చేస్తుంది. చాలా మంది ఈ కీరాను వంటకాల్లో ఉపయోగిస్తారు. కీరాలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల  దీనిని  డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఇకపోతే ఈ కీరా వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. విషయానికొస్తే ఈ కీరాను రోజు తినడం వల్ల కిడ్నీ సమస్యల నుండి విముక్తి పొందవచ్చునని నిపుణులు ధ్రువీకరించారు. మరి ఈ కీరా వల్ల ఇంకా ఎటువంటి లాభాలున్నాయి ఇప్పుడు చూద్దాము.. 

1. ఈ కీరాలో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించవచ్చును. నీటిని ఎక్కువగా కలిగి ఉండటం మూలంగా పేస్ కు ఈ కీరాను పోసుకోవడం వల్ల, పేస్ పొడిబారకుండా ఉంటుంది. 
2. వీటిల్లో పొటాషియం, మెగ్నిషియం, సిలికాన్ చర్మానికి మేలు చేస్తాయి.
3. అండాశయ, రొమ్ము, ప్రోస్టేట్, గర్భాశయ క్యాన్సర్‌లను నిర్మూలించే ఓషదాలు ఈ కీరాలో మెండుగా ఉన్నాయి. 
4. యూరిన్ ఇన్ఫెక్ట్య్క్షన్స్ రాకుండా కీరా కాపాడుతుంది. 
5. అంతేకాకుండా, నోటిలో సమస్యలను కూడా ఈ కీరా తగ్గిస్తుంది. 

చూసారుగా ఇన్ని ఉపయోగాలున్న ఈ కీరాకు మన నిత్యవారి ఆహారంలో కాస్త చోటిస్తే.. అందం, ఆరోగ్యం మీ సొంతం.. ఇప్పటి నుండి కీరాను తప్పక వాడండి.. 

Tags: cucumber health tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top