logo

మళ్ళీ ఫాన్స్ పై మండిపడ్డ సల్మాన్ ఖాన్


12-Aug-2019 14:41IST
salman khan gets angry on a fan girl

బాలీవుడ్ అగ్రనటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. మన దేశంలోనే కాదు వేరే దేశాల్లా వాళ్ళు కూడా సల్మాన్ ఖాన్ ను విపరీతంగా అభిమానిస్తున్నారు. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, ఫాన్స్ ను కొడుతూ తరచూ సల్మాన్ ఖాన్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలాసార్లు ఫాన్స్ పై చెయ్యి చేసుకున్న సల్మాన్ ఈసారి ఓ లేడీ ఫ్యాన్ వల్ల తన సహనాన్ని కోల్పోయారు. 

"హమ్ ఆప్ కే హే కౌన్" అనే సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ముంబై జరుగుతుండగా దానికి సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. సల్మాన్ థియేటర్ బయటకు వస్తున్నప్పుడు ఒక అమ్మాయి సల్మాన్ సెక్యూరిటీ గార్డ్స్ ని దాటుకొని వెళ్లి, సల్మాన్ చెయ్యి పట్టుకొని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది.  అయితే ఇలా అనుమతి లేకుండా చెయ్యి పెట్టుకోవడాన్ని సహించలేని సల్మాన్, చెయ్యి వదిలించుకొని కోపంగా వెళ్లిపోయారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్నిరోజుల క్రితం సెక్యూరిటీ గార్డ్స్ ను సల్మాన్ ఖాన్ కొట్టిన విషయం తెలిసిందే. ఫాన్స్ మని హద్దులు దాటి ప్రవర్తిస్తే, ఇలాగే తమ అభిమాన హీరో చేతిలోనే దెబ్బలు తినాల్సివస్తుంది.  

Read latest Movies News and Telugu News Follow us on FaceBookTwitter 

Tags: salman khan salman khan fan bollywood

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top