logo

నీ చూపు చాలు


12-Aug-2019 14:46IST
always with you

నేనటుగా నీవైపుగా వచ్చినప్పుడు
నువ్వో చెట్టు నీడవై చూస్తే చాలు
ఇక నేను ఇంకడమెరుగని నదిలా ప్రవహిస్తాను.

వసంతాన్నేదో కన్నుల్లో నింపుకొచ్చినట్టు
నన్నల్లుకున్న ఏ దిగులు ఋతువయినా..
నీ ఒక్కచూపుకే రాలిపోవడం.. ఎంత అద్భుతమది.

అనామక పువ్వును
నీ కనురెప్పల మునివేళ్ళ స్పర్శతో తాకాకనే కదా...
నా చుట్టూ పచ్చదనాన్ని లిఖించుకుని, 
పరిమళాన్ని అద్దుకున్నాను.

రాలిపడ్డ మంచు బిందువులను 
సూర్యుడు కిరణపు చూపుతో తాగినట్టుగా....

ఎండా వాన చూపుల కలయికలో 
ఓ హరివిల్లు పుట్టినట్టుగా..

వేల కెరటాల కన్నులతో....
సంద్రం తీరాన్ని  తాకినట్టుగా..
నాకు ఆ ఒక్క చూపునివ్వు చాలు...

ఇక నేను ఇంకడమెరుగని నదిలా ప్రవహిస్తాను.

             .....✍ వీరు

Tags: always with you

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top