logo

2020లో నెట్ ఫ్లిక్స్, అమెజాన్లకు సవాల్ గా మారనున్న జియో


12-Aug-2019 14:57IST
JIo is set to become a challenge for Netflix and Amazon in 2020

నేడు ముంబైలో జరుగుతున్న 42వ యాన్యువల్ జనరల్ మీటింగ్ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేసాడు. రిలయన్స్ గిగా ఫైబర్ సేవలను సెప్టెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. అదేంటంటే... ఇప్పటి వరకు మనం కొత్త సినిమాలను థియేటర్లో రిలీజ్ అయినా 30 నుండి 45 రోజుల వ్యవధిలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్లలో చూస్తుంటాం. కానీ ఇప్పుడలా కాదు రిలయన్స్ జియో గిగా ఫైబర్ ప్రీమియం కస్టమర్లు ఆయా సినిమాలు థియేటర్లో విడుదలైన రోజునే నేరుగా మీ ఇంట్లో చూడవచ్చునని ముఖేష్ అంబానీ ప్రకటించారు. 

'జియో ఫస్ట్ డే ఫస్ట్ షో'గా పిలిచే ఈ ఆఫర్‌ను ప్రీమియం వచ్చే ఏడాదిలోగా కస్టమర్లకు అందించనున్నట్లు తెలిపారు. దాంతో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి వాటికి జియో సవాలుగా మారింది. జియో ఫర్ ఎవర్ యాన్యువల్ ప్లాన్స్ తీసుకుంటే HD 4K ఎల్ఈడీ టీవీ, సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందిస్తుంది. రిలయెన్స్ జియో గిగా ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ సెకనుకు 1GB స్పీడ్‌తో డేటా పొందవచ్చు. ల్యాండ్‌లైన్ ఫోన్, జియో 4కే సెట్ టాప్ బాక్స్  ఉచితంగా ఇస్తారు. అల్ట్రా హైడెఫినేషన్ ఎంటర్‌టైన్‌మెంట్, మల్టీపార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్, హోమ్ సెక్యూరిటీ, స్మార్ట్ హోమ్ సొల్యూషన్స్ లభిస్తాయి. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మరో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు జియో సంస్థ పేర్కొంది. 

Tags: JIo Mukesh Ambani Netflix and Amazon 1gbps speed

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top