logo

మార్కెట్లోకి రానున్న నోకియా 6.2, 7.2 స్మార్ట్ ఫోన్లు


12-Aug-2019 16:45IST
nokia 62 72 smart phones soon market

హెచ్‌ఎండీ గ్లోబల్ కంపెనీ తన నోకియా స్మార్ట్‌ఫోన్‌ 6.2, 7.2 వెర్షన్లను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. కాగా ఈ ఫోన్ల ధరను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నోకియా 6.2లో 6.39 ఇంచ్ స్క్రీన్, 1080 x 1920 పిక్సెల్ రెజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 660, ఆక్టా కోర్ 2.2 ప్రొసెసర్లను వాడారు. 48, 8, 5 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పొందుపరచారు. 

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఫాస్ట్‌ చార్జర్‌తో సంస్థ ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇక నోకియా 7.2 విషయానికి వస్తే 6.18 ఇంచ్ స్క్రీన్, 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్, స్నాప్ డ్రాగన్ 660, ఆక్టా కోర్ 2.2 ప్రొసెసర్లను వాడారు. 48, 5, 2 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో పొందుపరచారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో అందుబాటులోకి తేనుంది.

Tags: nokia smart phone

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top