logo

దొంగల్ని తరిమికొట్టిన వృద్ధ దంపతులు


12-Aug-2019 18:05IST
the elderly couple who chased the robbers

తమిళనాడు: ఓ వృద్ద జంటపై దోపిడీకి తెగబడిన దుండగులకు ఎదురు తిరిగి సాహసంతో బుద్ధి చెప్పిన సంఘటన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు తన ఇంటి ముందు ఉన్న స్థలంలో కూర్చొని తన పని తాను చేసుకునే సమయంలో ఒక దుండగుడు ఆ వృద్ధుడి వెనకనుండి మెల్లగా వచ్చి తన చేతిలోని ఓ గుడ్డతో వృద్ధుడి మేడలో వేసి వెనకకు లాగి పక్కనే ఉన్న స్థంభానికి కట్ట్టేసే ప్రయత్నం చేసాడు. ఇంతలోనే వృద్ధుడి భార్య అక్కడికి చేరుకొని ప్రతిఘటించింది. ఈ పెనుగులాటలో వృద్ధుడు తన మెడకు కట్టిన టవల్‌ నుంచి విడిపించుకొని తమ వద్ద ఉన్న కుర్చీలతో ఆగంతకులపై ఎదురుదాడికి దిగారు. 

ఆగంతకులు కత్తులతో బెదిరించినా ఏమాత్రం భయపడకుండా కుర్చీలతో ప్రతిఘటించి వారిని తరిమి తరిమి కొట్టారు. దాంతో విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధ దంపతుల ధైర్య సాహసాలను పోలీసులు అభినందించారు. నెటిజన్లు సైతం ఆ ఓల్డ్ కపుల్ ని ప్రశంసిస్తున్నారు. మీ గుండె ధైర్యానికి, సాహసానికి హ్యాట్సాఫ్ అంటూ చెబుతున్నారు. దొంగలకే చెమట్లు పట్టించిన మీరు వృద్ధ దంపతులు కాదు వృద్ధ వీరులు అని పలు ప్రసంశలు కురిపిస్తున్నారు. 
 

Tags: old couple fighting robbers tamil nadu

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top