logo

ఇది రిలయన్స్ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి: అంబానీ


12-Aug-2019 21:37IST
this is the biggest foreign investment in Reliance history Ambani

దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడులు పెట్టిన కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో కంపెనీతో రిలయన్స్ ఒప్పందం కుదిరినట్టు సంస్థ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. ‘ఇది రిలయన్స్ చరిత్రలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి’ అని ముంబైలో జరిగిన కంపెనీ వార్షికోత్సవంలో అంబానీ ప్రకటించారు. ఇండియాలో అతిపెద్ద విదేశీ పెట్టుబడుల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. అప్పులతో కలిపి ఈ వ్యాపార ఒప్పందం విలువ 75బిలియన్ల డాలర్లు (రూ. 5లక్షల 32వేల 466 కోట్లు)గా అంబానీ వెల్లడించారు. 

ప్రపంచ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి చేసే కంపెనీగా సౌదీ అరామ్‌కో.. ముడిచమురుపై కొత్త మార్కెట్లను సెక్యూర్ చేసే ప్లాన్‌లో భాగంగా ఆయిల్ వాటా విక్రయంపై రిలయన్స్‌తో చర్చలు జరుపుతోంది.  ఈ నేపధ్యంలో తమ కంపెనీ ఆయిల్స్ వాటాలో 20 శాతం విక్రయించేందుకు రెడీ అయింది. రిల్ సంస్థకు చెందిన జామ్ నగర్ రిఫైనరీకి సుధీర్ఘ కాల ప్రాతిపాదికన ముడిచమురును రోజుకు 5లక్షల బరేల్స్ సౌదీ అరామ్‌కో సరఫరా చేస్తున్నట్టు అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా పెట్రోలియం రిటైల్ జాయింట్ వెంచర్ లో 51శాతం వాటాతో కలిపి రిలయన్స్ రిఫైనింగ్, పెట్రో కెమికల్ ఆస్తులన్నీ కవర్ కానున్నట్టు ఆయన చెప్పారు. 

Tags: biggest foreign investment Reliance history Ambani

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top