logo

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..!


13-Aug-2019 08:46IST
gold and silver price

దేశీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.39,190 వద్ద, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.35,820 వద్ద స్థిరంగా ఉంది. మరోవైపు కేజీ వెండి ధర రూ‌.44,522 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర  ఔన్స్‌కు 0.8 శాతం తగ్గుదలతో 1,508.35 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్స్‌కు 0.8 శాతం పెరుగుదలతో 16.95 డాలర్లకు చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.37,800కు, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.36,600 వద్ద కదలాడుతుంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ పసిడి, వెండి ధరలు ఇలానే ఉన్నాయి.

Tags: gold and silver price

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top