logo

ఆసియా సెయిలింగ్ పోటీల్లో మన హైదరాబాద్ సైలర్లు


13-Aug-2019 11:01IST
hyd sailors to take part in oman event

తెలంగాణ రాష్ట్ర రెగెట్టా ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన హైద్రాబాద్ యచ్ క్లబ్ సైలర్లు ఇపుడు మరో అవకాశాన్నిఅందిపుచ్చుకున్నారు. ఆసియా-ఓసానియా అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే అవకాశం మన భారతీయులైన ప్రీతీ కొంగర, లక్ష్మీ నూకరత్నం, ఝాన్సీ ప్రియా ఎంపికవ్వడం ఎంతో గర్వకారణం. ఒమాన్ వేదికగా సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వరకు ఈ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. 

ఇందులో భాగంగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజ్లాండ్ తో పాటు మరో 16 దేశాలకు చెందిన 300 మంది పోటీ పడనున్నారు. భారత్ నుండి మొత్తం 10 మంది బాల బాలికలు పాల్గొనగా అందులో నుండి హైదరాబాద్ యచ్ క్లబ్ నుండి ముగ్గురు అమ్మయిలు మాత్రమే ఎంపికవ్వడం విశేషంగా నిలిచింది. ఇలాంటి వేదికలో భారతీయ నావికులు పాల్గొనడం ఎంతో గర్వకారణం. హైదరాబాద్‌లో ఇప్పుడే ముగిసిన 11 వ ఎడిషన్ మాన్‌సూన్ రెగట్టాలో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ఫెడరేషన్ నుండి వారికి లభించిన ఉత్తమ స్థానం ఇది.

బాలుర విభాగంలో విజయ్ కుమార్, సచిన్, విశ్వనాధ్ లు మాజీ వైసిహెచ్ సైలర్ లు కాగా ఇప్పుడు వారు ఆర్మీ, నేవీ సెయిలింగ్ స్కూల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ప్రీతీ కొంగర నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంది. ఝాన్సీ, లక్ష్మీ రసూల్పురలోని ఉద్భవ స్కూల్ లో విద్యార్థులు. ఆర్ధికంగా వెనకబడిన కుటుంబాలు అయినప్పటికీ కోచ్ సుహేమ్ షైక్ సాహాయంతో, తన ట్రైనింగ్ తో ముందుకు రాణిస్తున్నారు. 

Tags: hyderabad sailors oman event

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top