logo

'శామీర్ పెట్'లో ఘోర రోడ్డు ప్రమాదం


13-Aug-2019 11:02IST
road accident at shamirpet

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని షామీర్ పేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు మందిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట నుంచి హైదరాబాదుకు వస్తున్న ఒక కారు, షామీర్ పేట్ కట్ట పైన అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కబోయింది, ఈ క్రమంలో డివైడర్ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న మారుతి కారుని ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించారు. మృతులలో ఒకరు మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటన పై  కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags: road accident shamirpet

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top