logo

బాబోయ్ ఓక ఆటోలో 24 మంది ప్రయాణికుల.. !


13-Aug-2019 11:40IST
24 passenges in one auto

ఆటోలో ప్రయాణం అంటే విసుగ్గా ఉంటుంది. ఒక పక్క ఆటో ఫుల్ అయినా సరే ఆటో వాలాలు, అత్యాశతో బ్యాగ్ లో బట్టలు కుక్కినట్లు జనాన్ని కుక్కేస్తుంటారు. అయితే ఇలా ప్రయాణికులను ఎక్కించుకోవడంలో కూడా కొంత లిమిట్ మెయింటైన్ చేస్తుంటారు కొందరు. కానీ మరీ ఇంతలా ప్రయాణికులను కుక్కించి తీసుకెళ్లడాన్ని చూస్తే ముక్కున వేలేసుకుంటారు. మెదక్ జిల్లాలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ ఆటోలో చిన్న పెద్ద అందరిని కలిపి ఏకంగా 24 మంది ప్రయాణికులను ఎక్కించాడు డ్రైవర్. గ్రామానికి వెలుతుండగా మార్గ మధ్యలో పోలీసులు పరిధిని మించి ప్రయాణికులను తీసుకువెళుతున్న ఆటోను నిలువరించారు. ఆటోలో ఒక్కసారిగా అంతమంది ప్రయాణికులు ఉండడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. అనంతరం ఆటో డ్రైవర్ ను మందలించి కేసు నమోదు చేసి పంపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags: 24 passenges auto medak

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top