logo

టీమిండియా కోచ్‌ పదవికి రంగం సిద్ధం


13-Aug-2019 12:18IST
bcci shortlists team india head coach position

టీమిండియా కోచ్‌ పదవికి రంగం సిద్దమయింది. కపిల్‌ దేవ్‌,  శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏవో) ఆధ్వర్యంలో ఈ శుక్రవారం హెడ్ కోచ్ ఎంపిక జరగనుంది. ఈ పదవి కోసం ఎన్నో సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా.. అర్హులైన ఆరుగురితో తుది జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎనిమిది మందితో కూడిన జాబితాను సోమవారం సీఏవో ఆరుగురికి కుదించింది. గ్యారీ కిర్‌స్టెన్‌, మహేల జయవర్ధనే రేసు నుంచి అవుటయ్యారు.

రవిశాస్త్రికి గట్టి పోటీ:
రవిశాస్త్రే కోచ్‌గా కొనసాగాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు అన్షుమన్‌ గైక్వాడ్‌ కూడా బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో.. ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లీ అభిప్రాయాల్ని సీఏవో కమిటీ పరిగణనలోకి తీసుకోదని బీసీసీఐ స్పష్టం చేసింది. 

సీఏవో కమిటీ ప్రధాన కోచ్‌ పదవికి మాత్రమే ఇంటర్వ్యూలు చేపట్టనుందట. సహాయ కోచ్‌లు (బౌలింగ్, బ్యాటింగ్, ఫిజియో), ఇతర సిబ్బంది సంబందించిన ఇంటర్వ్యూ లను భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter  

Tags: ravi shastri india head coach bcci mike hesson tom moody coa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top