logo

టెలిగ్రాంలో మరో కొత్త సాంకేతికత


13-Aug-2019 12:37IST
telegram adds ability to keep in silence for notifications

ప్రైవేట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్, వాయిస్ ఓవర్ ఐపి సర్వీస్ టెలిగ్రామ్ వినియోగదారులకు నిశ్శబ్ద సందేశాలతో పాటు యానిమేటెడ్ ఎమోజీలను పంపే సామర్థ్యాన్ని తెచ్చే నవీకరణలను రూపొందించింది టెలిగ్రాం. సాధారణంగా ఎవరికైనా ఒక మెసేజ్​ పంపితే వాళ్లకు సౌండ్​తో ఒక నోటిఫికేషన్​ వస్తుంది. అలా రాకూడదనుకుంటే వాళ్లు మొబైల్​ను సైలెంట్​ మోడ్​లో పెట్టుకోవాలి లేదా యాప్​ నోటిఫికేషన్స్​ ఆఫ్​ చేసుకోవాలి. కానీ, టెలిగ్రామ్​ సైలెంట్​ఫీచర్​తో ఇవేవీ చేయకుండానే సైలెంట్​గా మెసేజ్​ రిసీవ్​ చేసుకోవచ్చు.
దీనికోసం టెలిగ్రామ్​లో యూజర్లు ఒక మెసేజ్​ పంపేటప్పుడు సెండ్​ బటన్​ ప్రెస్​ చేసి, కొద్దిసేపు హోల్డ్​ చేయాలి. ఆ తర్వాత కనిపించే ‘సెండ్​ వితౌట్​ సౌండ్ ఆప్షన్’ సెలెక్ట్​ చేసుకుని, మెసేజ్​సెండ్​ చేయాలి. ఇలా మెసేజ్​ పంపితే రిసీవర్స్ ముఖ్యమైన పనుల్లో ఉన్నా, నిద్రలో ఉన్నా కూడా ఇబ్బంది అవ్వకుండా  స్క్రీన్​పై సైలెంట్​ నోటిఫికేషన్​ మాత్రమే వస్తుంది. ఎలాంటి రింగ్​టోన్​ లేదా సౌండ్​ చేయదు.

యానిమేషన్​ ఎమోజీలను కూడా టెలిగ్రామ్​ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్​లో పంపే వీడియోలకు ‘థంబ్​నెయిల్స్, టైమ్​స్టాంప్స్’ వంటివి యాడ్​చేయొచ్చు. అంటే ఆ వీడియోలో మీరుంటే ఎక్కడున్నారో చూపెడుతూ థంబ్​నెయిల్​ యాడ్​ చేసుకోవచ్చు. ఒక వీడియోలోముఖ్యమైన ​ సీన్ ​దగ్గర టైమ్​స్టాంప్​ వేయొచ్చు. దీనివల్ల టైమ్ వేస్ట్​ అవకుండా నేరుగా అక్కడ్నుంచే వీడియో చూడొచ్చు. ఈ కొత్త రకం సర్వీసెస్ యూజర్లలో మరింత జోరు పెంచుతున్నాయి.

Tags: telegram adds keep silence notifications

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top