logo

హ్యాపీ లెఫ్ట్ హ్యాండర్స్ డే


13-Aug-2019 13:22IST
happy left handers day

పాత కాలం నుండి కూడా ఎడమ చేతి వాటం ఉన్న వారిని  శుభకార్యాల్లోకి ఎక్కువగా రానివ్వరు. ఎందుకంటె హిందువుల సంప్రాదాయ ఆచారాల ప్రకారం ఎడమ చెయ్యి అనేది ఒక అరిష్టంగా భావిస్తారు. కానీ ఎడమ చేతి వాటం ఉన్నవారికి మంచి తెలివితేటలు, మంచి జీవితం ఉంటుందని కూడా పూర్వీకుల నుండి వస్తున్న నమ్మకం. మరి అలాంటి ఎడమ చేతి వాటం వారికి కూడా ఒక రోజు ఉందని మీలో ఎంత మందికి తెలుసు? 

అవునండీ.. ఇది నిజమే! ప్రపంచ జనాభాలో పది శాతం ఎడమ చేతి వాటం వారున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఆగష్టు 13న ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే అని పెట్టారు. 


అయితే ఎడమ చేతి వాటంలో కూడా కొన్ని రాకాలుంటాయట. కొందరు ఎడమ చేతితో కేవలం రాస్తారు, మిగితా పనులన్నీ కూడా కుడి చేతితో చేస్తారు. కొందరు ఏదైనా వస్తువుల్ని అందుకోమన్నా.. తీసుకుని పట్టుకోవాలన్నా ఎడమ చేతిని వాడతారు. మరికొందరు మాత్రం.. వారి అన్ని పనులూ ఎడమ చేత్తోనే చేస్తారు. మరికొందరు అవలీలగా రెండు చేతులతోనూ అన్ని పనులు చేయగలరు, రాయగలరు.  ఇలా ఎడమ చేతి వాటంలోనూ ప్రత్యేకతలు ఉన్నాయి.

ప్రత్యేకంగా క్లబ్:
నిజం చెప్పాలంటే ఎడమచేతివాటం ఉన్నవారు అంత తేలిగ్గా జీవితాన్ని గడపలేరు. వీరికి అనేక సామాజిక, సాంకేతిక సమస్యలుంటాయి. వీటిని పరిష్కరించేందుకే సందీప్ విషనోయ్ అనే వ్యక్తి 2009లో మహారాష్ట్రలోని  ఔరంగాబాద్లో  ‘లెఫ్ట్ హ్యాండర్స్’ క్లబ్‌ని స్థాపించారు. దీని ద్వారా ఎడమచేతివాటమున్న విద్యార్థులు, మహిళలకు ఐన్‌స్టీన్ పేరుతో స్కాలర్‌షిప్‌లు, మదర్‌థెరిసా పేరిట స్వయం ఉపాధికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ లెఫ్ట్ హ్యాండర్స్ విగ్రహాలు, జీవిత విశేషాలతో గోవాలో ఏకంగా మ్యూజియంనే ఏర్పాటుచేశారు.

ఎడమ చేతి వాటం ఎందుకు?
అసలు ఎడమచేతివాటం జన్యువుల, పరిసరాల ప్రభావం కారణంగా వస్తుంది. LRRTM1 జన్యువు తండ్రి నుంచి శిశువుకి సంక్రమిస్తే ఈ లక్షణం ఉంటుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు తల్లి శరీరంలో ఉండే టెస్టోస్టీరాన్‌ అనే హార్మోన్‌ స్థాయిపై కూడా ఆధారపడి ఈ లక్షణం వస్తుంది. అంతే కాకుండా శిశువు పెరుగుతున్న పరిస్థితుల్లో ఉండే పరిసరాలు కూడా ఎడమ చేతి వాటాన్ని ప్రదర్శించేందుకు దోహాద పడతాయి.

ఎందరో మహనీయులు:
మన ప్రముఖుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారున్నారు. మహాత్మా గాంధీ ఎడమ చేతితోనే రాసేవారు. అదేవిధంగా వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీభాయి కూడా లెఫ్ట్ హ్యండరే. అంతెందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎడమచేతితోనే రాస్తారు. మనకు తెలిసిన అంతర్జాతీయ ప్రముఖుల్లో బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షులు బారక్ ఒబామా, ఇంగ్లాండ్ రాజ వంశస్థులు ప్రిన్స్ చార్లెస్,  హాలీవుడ్ నటీమణులు ఎంజేలీన జోలీ, హాలీవుడ్ రాంబో స్టార్ సిల్వస్టర్ స్టాలిన్, మార్లిన్ మన్రో ఇలా చాలా మంది వున్నారు. 

ఇక మన దేశానికి వస్తే..రతన్ టాటా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మదర్ థెరిస్సా, రజనీకాంత్, ప్రముఖ గాయని ఆశా భొంశ్లే, లక్ష్మి మిట్టల్, అభిషేక్ బచ్చన్, గుత్తా జ్వాల, ధీరు భాయ్ అంబానీ, రాహుల్ బజాజ్,  సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, సినీనటులు ముమ్ముట్టి, ప్రకాష్ రాజ్, వేణుగాన గంధర్వుడు హరిప్రసాద్ చౌరాసియా,ఇలా చాల మంది ప్రముఖులంతా ఎడమ చేతి వాటం వారే... ప్రతీ వాళ్ళలోను ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే వీరి విగ్రహాలన్నీ ఆ మ్యూజియంలో ఉంటాయి. 
ఈ సందర్భంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళందిరికి హ్యాపీ లెఫ్ట్ హ్యాండర్స్ డే. 


Tags: happy left handers day

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top