logo

మనం ఎప్పటికి నిజాలనుకొని నమ్ముతున్నవేంటో చూడండి..


13-Aug-2019 14:23IST
unknow facts about cat

ఎవరైనా నిజం చెబితే  ఎవరు నమ్మరు కానీ, అబద్దం చెబితే అది నిజమని నమ్మే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అలా మనం చాలా అబద్దాలను నిజాలని నమ్ముతుంటాము. అలా మనము ఈజీగా నమ్మే కొన్ని అబద్దాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాము..

వీటి వల్ల కంటి చూపు పెరుగుతుందా:

ఆరోగ్యాంగా ఉండాలంటే మనము తీసుకొనే ఆహారం దానికి పూర్తిగా సహకరిస్తుంది. ఇంకా చెప్పాలనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందన్నది నిజం.కాకపోతే కొంతమంది కంటి చూపు మెరుగు పడాలంటే క్యారెట్లు , ఇంకా ఆకుకూరలు, బ్లూ బెర్రీ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయని అంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు.అలా కనిపిస్తే మన వాళ్ళు ఆ ఆహార పదార్థాలను నామ రూపాలు లేకుండా చేసేవాళ్ళేమో. వాటిలో విటమిన్స్ ఉంటాయి కానీ కొంత మోతాదులో మాత్రమే ఉండటం వల్ల అవి మన శరీరానికి సరిపోవు.

కుక్కలు రంగులను చూడలేవు :

కుక్కలు రంగులను చూడలేవు అని చాలా మంది అంటుంటారు. వాటికి కేవలం  తెలుపు , నలుపు కలర్స్ మాత్రమే చూస్తాయని. అందుకే అవి రాత్రి పూట మనకు కనిపించని వాటిని కూడా చూస్తాయని నమ్ముతారు. అప్పటి నుండి ఇప్పటివరకు అలా నమ్ముతున్నారు. కానీ, ఈ కుక్కలు అన్ని రంగులు చూస్తాయని  శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అయితే, ఒక ఆరేంజ్ రంగును మాత్రమే చూడలేవట. అందుకే కుక్కల ప్రేమికులు వాటికి ఆరేంజ్ రంగుకు దూరంగా పెంచుకుంటారు.

ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడటం :

ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడటం అనేది నిజంగానే జరుగుతుందా.. అంటే అది ఏ మాత్రం నిజం కాదనే చెప్పాలి. మాములుగా రైటర్స్ కి, డైరెక్టర్స్ కి  జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ కి లోనవుతుంటారు కాబట్టి వాళ్ళ జుట్టు తెల్లబడుతుంది అని అందరు నమ్ముతుంటారు. అది వాళ్ళ అపోహ తప్ప మరేమి లేదు. నిజానికి వాళ్ళు టైం కి తినకపోవడంతో విటమిన్స్ లోపం వల్ల అలా జరుగుతుంది.

ఈతకొడుతున్న టైములో తినకూడదు :

మాములుగా ఈత కొడుతున్న టైములో తినకూడదని అంటారు. ఎందుకంటే అలా తినడం వల్ల ఈత సరిగ్గా కొట్టలేమని వాళ్ళ నమ్మకం. అంతే తప్ప మరేమి కాదు . తిన్నాక కూడా ఈత కొట్టవచ్చునట . ఈతకొట్టేది చేతులతో కాబట్టి , పొట్టకు సంబంధం లేదు .కొందరేమో తిన్న తర్వాత చేస్తే ఇంకా మంచిదని అంటున్నారు.

పిల్లులు కాళ్లతో మాత్రమే పై నుండి దూకుతాయి :

సాధారణంగా పిల్లులు అనేవి నేలపైకి దూకే టప్పుడు  కాళ్లపైనే దూకుతాయని అంటారు. ముందరున్న కాళ్ళను వాడి భూమిదకు దూకుతాయని నమ్ముతారు. కానీ, పిల్లులు పై నుండి దూకేటప్పుడు బాడీ మొత్తాన్ని ఒక ఫ్యారాచూట్ లా మార్చుకొని, నెమ్మదిగా వాటి వేగాన్ని తగ్గించుకొని నెల మీదకొస్తాయి. అంతేకాని, కాళ్ళ మీద మాత్రమే దూకవు .

డెడ్ సి :

డెడ్ సి ఇది ఈ ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఉప్పు సముద్రం అంటారు. ఇక ఇందులో దూకిన కూడా ఎవరు మునిగిపోరంట. ఎలాగంటే నీటిలో మునగకుండా బెండులను వాడినట్లు పైన తేలుతూ ఉంటారట. అసలు నిజమేంటంటే ఈ సముద్రము కన్నా అతి పెద్ద ఉప్పు సముద్రం మరొకటి ఉంది. అది అంటార్కిటికాలో ఉంటుంది. చుట్టూ మంచుతో కప్పబడిన కొండలు ఉండగా అది మాత్రమే నీళ్లలాగా ఉంటుంది. దానితో ఎన్నో పరీక్షలు చేయగా అందులోని నీళ్లు అనేవి చాలా ఉప్పును కలిగి ఉన్నాయని నిర్థారించారు..

చూసారుగా ఇవి మనం ఎప్పటినుండో నమ్ముతూ వస్తున్నా నిజాలనుకున్న అబద్దాలు. వీటి గురించి మనం ఎన్ని సార్లు చెప్పిన కూడా వాళ్ళు చెప్పేదే నిజమని అంటారు. 

Tags: cats unknown facts cats secrets

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top