logo

నిమ్మతో నిగ నిగ లాడే చర్మం మీ సొంతం..


13-Aug-2019 15:00IST
lemon beauty tips

నిమ్మతో వంటలే కాదు.. చర్మం యెక్క అందాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు. నిమ్మతో ఎన్నో ఆరోగ్య కర ప్రయోజనాలున్నాయి. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నిమ్మకాయలు మనం పూజకు వాడతాము. ఎందుకంటే పవిత్రతకు నిదర్శనం కాబట్టి. మరి ఈ నిమ్మకాయలతో చర్మానికి ఎటువంటి మేలు జరుగుతుందో ఇప్పుడు చూద్దాము.. 

నిమ్మకాయ, చక్కర :

Image result for lemon with sugar face pack

ఒక స్పూన్ చక్కర తీసుకోని, అందులో చక్కర మునిగే వరకు నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకొని 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ను రాత్రి వేసుకుంటే బాగా ఉపయోగం ఉంటుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు కనుక వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

నిమ్మకాయ, తేనే : 

Image result for lemon with honey

ఒక స్పూన్ తేనెలో రెండు లేదా మూడు చుక్కలు నిమ్మరసం వేసుకొని, ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి అంతే మృదువైన చర్మం మీ సొంతం. 

నిమ్మకాయ, బ్రూ :

Image result for lemon with bru

అరస్పూన్ బ్రూలో, ప్యాక్ వేసుకోవడానికి వీలుగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకొని ఒక 20 నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి. 

నిమ్మకాయ, అలోవేరా :

Image result for lemon with aloe vera

ఒక స్పూన్ అలోవెరా గుజ్జులో, మూడు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖాన్ని రాసుకొని, 10 నిమిషాలు అయ్యాక కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు కనుక వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మకాయ, బియ్యపు పిండి:

Image result for lemon with rice flour face pack
 
ఒక స్పూన్ బియ్యపు పిండిలో, చిటికెడు పసుపు వేసుకొని, ఒకస్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకొని బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అంతే మెరిసే చర్మం మీసొంతం.. 

చూసారుగా నిమ్మతో నిగ నిగలాడే చర్మం ఎలా వస్తుందో.. ఈ బ్యూటీ టిప్స్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.. 

 

Tags: lemon beauty tips

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top