logo

తన నిజాయితీ నిరూపించుకున్న... ఓలా డ్రైవర్


13-Aug-2019 15:05IST
proving his honesty  ola driver

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు తమ స్వార్థంకోసం పరుగులు తీసేవారే. రోడ్డు మీద ఏ చిన్న వస్తువు దొరికిన నాదే అని లోపలేసుకునే రోజులివి అలాంటి ఈ రోజుల్లో ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని నిరూపించుకున్నాడు. వివరాల్లోకెళితే...నయా క్విలాకు చెందిన అర్బాజ్ అనే వ్యక్తి  ఓలా క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చిలకలగూడకు చెందిన కిరన్మయి సోమవారం ఉదయం బొల్లారం నుంచి ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. అయితే చిలకలగూడలోని తన ఇంటి దగ్గర దిగేటప్పుడు, ఆమె కారులో నుండి తన హ్యాండ్‌బ్యాగ్ తీసుకోవడం మర్చిపోయింది. అది గమనించని క్యాబ్ డ్రైవర్ అక్కడి నుండి తన ఇంటికి వెళ్లి కార్ ని శుభ్రం చేస్తుండగా...ఆ బ్యాగ్ తన కంట పడింది. 

దాంతో ఆ బ్యాగ్  కిరన్మయిదని నిర్దారించుకొని వెంటనే గోల్కొండ పోలీసులను సంప్రదించగా...పోలీసులు కిరన్మయికి సమాచారం ఇచ్చారు. దాంతో  ఆమె పరుగున గోల్కొండ ఠాణాకు చేరి బ్యాగుని స్వాధీనం చేసుకుంది. అనంతరం బ్యాగుని తెరిచి చూడగా.. అందులో తన 2తులాల బంగారు గొలుసు, 30తులాల వేడితో పాటు రూ.2000 నగదు అలాగే ఉండంతో ఊపిరి పీల్చుకుంది. ఇంత డబ్బు బంగారo ఉన్న బ్యాగుని తిరిగి తెచ్చినందుకు అర్బాజ్ నిజాయితీకి మెచ్చుకొని కిరన్మయి మరియు పోలీసులు అభినందించారు. 

Tags: proving honesty ola cab driver

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top