logo

ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం


13-Aug-2019 15:44IST
surviving spouse extramarital affairs

బెంగళూరు: తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన బెంగళూరులోని హనుమత నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి దంపతులకు 18ఏళ్ళ క్రింద వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు మానస, భూమిక. ప్రస్తుతం వీరు శ్రీనగర కాళప్పలేఔట్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ సమీపంలో నివాసముంటున్నారు.  మానస ప్రథమ పీయూసీ చదువుతుండగా, భూమిక ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతోంది. 

సిద్దయ్య కేఈబీ లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తుండగా రాజేశ్వరి ఇంట్లోనే ఉండేది. ఇన్నాళ్లు సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో విషాదం చోటు చేసుకుంది. సిద్దయ్య మూడేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలవడంతో రాజేశ్వరి తీవ్ర ఆవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో పలుమార్లు కుటుంబ పెద్దలతో రాజీ చేసిన సిద్దయ్య ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. ఈ మధ్య సిద్ధయ్య ఇంటికి రావడం కూడా తగ్గించడంతో భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. 

విధుల నిమిత్తం సిద్దయ్య వేరే ప్రాంతానికి వెళ్లడంతో అదే అదునుగా భావించిన రాజేశ్వరి, పిల్లలు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన సిద్దయ్య ఎంతసేపటికి ఇంటి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు బద్దలుకొట్టి గదిలో చూడగా ముగ్గురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రాజేశ్వరి తన వాట్సాప్‌ చివరి స్టేటస్‌లో 'జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డామని తన చావుకు సిద్దయ్య, అతని ప్రియురాలే కారణమని' తెలిపింది.   

Tags: extramarital affairs suicide 3 members

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top