logo

2028 ఒలంపిక్స్ లో క్రికెట్ !


13-Aug-2019 16:34IST
cricket going to be a sport in  2028 olympics

ఎన్నో ఏళ్లుగా సాగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా అడుగులు మొదలయ్యాయి. అందులో భాగంగా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ తమ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ప్రపంచ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌ మైక్‌ గ్యాటింగ్ ఓ క్రీడా ఛానల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఒలంపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశ పెట్టడానికి ఇన్నాళ్లు ఒక అడ్డంకి ఉండేది, తాజాగా అది కూడా తొలగిపోవడంతో..   ఒలంపిక్స్ లో భాగంగా క్రికెట్ ను త్వరలో చూడవచ్చు . కాగా, ఇటీవలే నాడా(నేషనల్‌ ఆంటీ డోపింగ్‌ ఏజెన్సీ) పరిధిలోకి బీసీసీఐ చేరిన విషయం అందరికి తెలిసిందే. 

2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడానికి తగిన కార్యాచరణను ఇదివరకే ప్రారంభించామని ఐసీసీ కొత్త ముఖ్య కార్యదర్శి మనుసావ్నే ఎంసీసీ కమిటీతో అన్నాడని గ్యాటింగ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఆటలు నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. పురుషుల జట్లతో పాటు మహిళల క్రికెట్ కి కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుందని గ్యాటింగ్ తెలిపారు. ఇటీవలే మహిళల క్రికెట్‌ను 2022 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ సైతం ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు.

Read latest Sports News and Telugu News |Follow us on FaceBookTwitter  

Tags: 2028 olympics Los Angeles Games MCC MIKE GATTING

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top