logo

రాజీవ్ రహదారిపై కారు బీభత్సం


13-Aug-2019 16:39IST
road accident at karimnagar

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తూన్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కిరాణా షాపులోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ కు చెందిన నర్సింగ్ భూషణ్, స్వరూప, విజయకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకుతీసి, గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Tags: karim nagar road accident

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top