logo

మెంతులతో మెండైన ఆరోగ్యం..


13-Aug-2019 17:34IST
benifits of fenugreek seeds

మెంతులు అనేవి రుచికి చేదుగా ఉన్న కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ మెంతులను మనం కూరల్లోనూ, ఉరగాయాలలోను వాడుతుంటాము. ఈ మెంతులే  కాదు మెంతి ఆకుల వల్ల కూడా ఆరోగ్యం ఉంటుంది. ఈ ఆకులను కూరల్లో వేసుకొని తినడం వల్ల ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు షుగర్ లెవల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అటువంటి మెంతుల వల్ల ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాము.. 

1. ఈ మెంతులను పొడి చేసుకొని, కొద్దిగా పెరుగులో కలుపుకొని జుట్టుకు అప్లై చేసుకొని ఆరాక కడిగేసుకుంటే చాలు.. జుట్టు సమస్యలను ఇంటినో అదుపు చేయవచ్చును. 
2.  మెంతులలో ఇనుము, విటమిన్ సి తో పాటుగా బి కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మెంతులను వాడటంతో వల్ల శరీరంలో ఉండే అధిక కొవ్వును తగ్గించ వచ్చును. 
3. వీటిలో కొన్ని రకాల చేదు ఔషదాలు ఉండటం వల్ల వీటిని తరచూ వంటలో చేర్చి తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 
4. మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే కచ్చితంగా కరిగిపోతుంది. 
5. నైట్ మొత్తం ఈ మెంతులను ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టి , ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. 

చూసారుగా చేదుగా ఉండే మెంతులు కూడా మనకు ఎంత మేలు చేస్తాయో.. ఇప్పటి నుండి తప్పక మెంతులు చేర్చుకోవడం మాత్రం మరువకండి... 


Tags: fenugreek seeds health benifits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top