logo

ప్రముఖ సింగర్‌ ఇంట్లో విషాదం


13-Aug-2019 18:09IST
tragedy at home of famous Singer

మలయాళ ప్రముఖ గాయకుడు బిజు నారాయణన్‌ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తనకు వెన్నంటే ఉండి ప్రతి పనిలో సహకరించిన తన అర్దాంగి శ్రీలత మృతి చెందడంతో సింగర్ బిజు నారాయణన్ మరియు ఆయన కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో భాదపడుతున్న శ్రీలత  ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్స్ విషయం తెలిసిందే. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితీ విషమించడంతో నిన్న సాయంత్రం ఆమె మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమె అంత్యక్రియలు నేడు రాత్రి ఏడు గంటల సమయంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మాతృభాషతో పాటు పలు దక్షిణ భారత భాషల్లో 400 పైగా పాటలు పాడి అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన భార్య శ్రీలత మృతి పట్ల బిజు సన్నిహితులు, సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. 

Tags: famous singer wife died

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top