logo

సిక్కిం లో విరిసిన కమలం


13-Aug-2019 19:07IST
10 SDF MLAs joins BJP in sikkim

సిక్కిం లో ఒకటే రోజులోనే కమలం పార్టీ విరబూసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవని కమలం పార్టీ, రోజు మారే సరికి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 32 అసెంబ్లీ స్థానాలు ఉన్న సిక్కిం అసెంబ్లీకి 2019లో ఎన్నికలు జరగ్గా, సిక్కిం క్రాంతి మోర్చా(SKM) 17 స్థానాల్లో గెలిచి అధికారాన్ని చేపట్టింది. 15 మంది ఎమ్మెల్యేల తో సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ(SDF) రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఒక రాష్ట్రానికి 25 సం లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న సిక్కిం  క్రాంతి మోర్చా అధినేత  పవన్ చామ్లింగ్ కు షాక్ ఇస్తూ 10 మంది ఎమ్మెల్యేలు ఈ ఉదయం కమల తీర్థం పుచ్చుకున్నారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన 10మంది ఎమ్మెల్యేలు, పార్టీ జనరల్‌ సెక్రటరీ రామ్‌ మాధవ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.  

సిక్కిం మినహా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో అధికారంలో ఉన్న బీజేపీ, ఇప్పుడు సిక్కింలో కూడా ఖాతా తెరవడంతో పూర్తి ఈశాన్య భారతాన్ని కాషాయ మయం చేసింది. గతంలో కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలకు మంచి పట్టు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. తాజాగా సిక్కింలో కూడా బోణి కొట్టడంతో మొత్తం ఈశాన్య భారతంపై పట్టు సాధించినట్లైంది.   

Delhi: 10 MLAs of Sikkim Democratic Front join BJP in presence of BJP Working President JP Nadda and General Secretary Ram Madhav

View image on TwitterView image on TwitterView image on Twitter

Tags: 10 Sikkim Democratic Front MLAs joins BJP in sikkim

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top