logo

స్టార్ అయినా ఫైన్ కట్టాల్సిందే..


13-Aug-2019 19:40IST
star also should be fine

హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసినందుకు ప్రముఖ యంగ్ హీరోకి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. వివరాల్లోకెళితే...యంగ్‌ హీరో నాగశౌర్య కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి రూ. 500ల ఫైన్‌ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. కారులో ఉన్న మనిషి కనిపించకుండా..కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే అది ఎవరైనా సరే జరిమానా విధించడం ఖాయం అని మరో సారి ఋజువయ్యింది. 

ఈ మధ్య కాలంలోనే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నగరంలోని మూసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌ వద్ద వర్మ తన సహదర్శకులతో కలిసి బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. రాంగోపాల్‌వర్మ ట్రిపుల్‌ డ్రైవింగ్‌ వ్యవహారంపై స్పందించిన పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కింద వర్మ కు రూ.1350 జరిమానా విధించారన్న సంగతి  విదితమే.

Tags: nagashourya traffic police 500fine car glass black film

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top