logo

నా 40ఏళ్ల అనుభవంలో ఇలాంటివి చూడలేదు


13-Aug-2019 19:42IST
chandrababu naidu comments on ysrcp government

వైసీపీ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరో సారి తీవ్రస్థాయిలో మండి పడ్డారు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ప్రభుత్వం ఏర్పడ్డాక అరాచకాలు ఎక్కువైపోయాయని, రాష్ట్రంలో అన్యాయాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన మండి పడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 469 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, అందులో ఎనిమిది మందిని హత్య చేశారని చంద్రబాబు అన్నారు. 

నెల్లూరు జిల్లాలో తమ పార్టీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేసారని చాల మంది గ్రామాలు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు కూడా చూసిచూడనట్టు వదిలేస్తున్నారని, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి దారుణాలు చూడలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని చంద్రబాబు అన్నారు.

Tags: chandrababu naidu ysrcp government tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top