logo

కన్న కొడుకుకి భారంగా మారిన తల్లి శవం


13-Aug-2019 19:43IST
the corpse of a mother who became a burden to her son

అమృతం తాగే వాళ్ళని దేవుళ్లంటారు... అది కన్న బిడ్డలకు పంచే వాళ్ళని అమ్మ నాన్నలంటారు.. ఆ అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ అది అమ్మ ప్రేమ ముందు తక్కువే. సృష్టిలోనే అమ్మ ప్రేమ చాలా విలువైనది, వెల కట్టలేనిది. అంతే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర అమోఘమైనది. అద్వితీయమైనది. కానీ, ఓ ప్రబుద్ధుడు నవమాసాలు మోసిన తల్లి పట్ల కర్కశంగా వ్యవరించిన వైనం తమిళనాడులో చోటుచేసుకుంది...పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం...తూత్తుకుడి జిల్లా ధనసింగ్‌ నగర్‌కు చెందిన ముత్తులక్ష్మణన్‌ అనే వ్యక్తి స్థానిక గుడిలో పూజారిగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి తల్లి వసంతి వయసు మీద పడడంతో తనువు చాలించింది. 

అందుకు చలించని ముత్తులక్ష్మణన్‌ ఆమె శవం ఎక్కడ భారమవుతుందోనని ఆమెకు అంత్యక్రియలు కూడా చేయించకుండా డబ్బులు లేవంటూ కన్నతల్లి శవాన్ని చెత్తకుండీలో పారేసి చేతులు దులుపుకొన్నాడు. ఆమె మృతదేహం చెత్తకుండీలో ఉండటం చూసిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. విచారణలో ముత్తులక్ష్మణన్‌ తన తల్లి శవాన్ని చెత్తకుండీలో పడేేసి వెళ్లినట్లు తేలింది. అనంతరం అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో ఈ పని చేసినట్లు ముత్తులక్ష్మణన్‌ సమాధానమిచ్చాడు.

Tags: tamilnadu mother dead body throw in dustbin

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top