logo

భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య


13-Aug-2019 19:45IST
wife brutally murdered her husband

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య అతికిరాతకంగా నరికి చంపింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన, జిల్లాలోని నార్పల మండలం సిద్దాలచెర్ల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓబులప్ప, లక్ష్మీదేవి అనే దంపతులు సిద్దాల చెర్ల అనే గ్రామంలో నివాసముంటున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరిమధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో తరచుగొడవపడేవారు. ఈ నేపద్యంలో భర్త ఓబులప్ప ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో భర్య లక్ష్మీదేవి అతనిపై దాడి చేసి అతికిరాతకంగా నరికి చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: crime ananthapur

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top