logo

పాపం దొంగలకు ఎంత కష్టం వచ్చింది ..!


13-Aug-2019 19:48IST
cc camera theft in khammam bank

ఖమ్మం జిల్లా దమ్మపేట ఏపీజివిబి బ్యాంకును లూటీ చేసేందుకు గుర్తుతెలియని దుండగుల విఫలయత్నం చేశారు. వరుస సెలవులు రావడంతోపాటు ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో, ఇదే అదనుగా భావించిన దొంగలు బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ ఇనుపచువ్వలను బలమైన ఇనుపకడ్డీతో వంచి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండ సెన్సార్ సిస్టమ్ ని ఆఫ్ చేసి, బ్యాంకులో నగదు, వెండి బంగారు నగల ఆభరణాలు భద్రపరిచే ఐరన్ సేఫ్టీ లాకర్ ని గ్యాస్ కట్టర్ తో కట్ చేయడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా లాకర్ తెరుచుకోకపోవడంతో నిరాశ చెందిన దొంగలు అక్కడే ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను, సీసీ కెమెరాలను తీసుకుని పరారయ్యారు. 

ఉదయం బ్యాంక్ తెరిచిన ఉద్యోగులు, లాకర్ పగలగొట్టి ఉండడాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కొన్ని ఆధారాలను సేకరించామని, దమ్మపేట గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాల ద్వారా దొంగలను గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుని తీరుతామని అశ్వరావు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య తెలిపారు. అయితే బ్యాంకులో ఎటువంటి నగదుగాని, ఆభరణాలుగాని చోరీకి గురికాలేదని బ్యాంక్ అధికారులు తెలిపారు. 

Tags: kammam bank theft

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top