logo

మహారాష్ట్ర వరద బాధితులకు భారీ విరాళం


13-Aug-2019 19:50IST
genelia helps flood people in maharashtra

బొమ్మరిల్లు చిత్రంలో హాసిని గా తెలుగు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికి గుర్తుండిపోయే నటి జెనీలియా. అందం, అభినయంతో పాటు ఆమెకు గొప్ప మనసు కూడా ఉందని తాజా సంఘటన రుజువు చేసింది. గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే .ఇప్పటికీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకునే ఉన్నాయి. కాగా తాజాగా ఈ వరద భాదితులకు జెనీలియా ఆమె భర్త రితేష్ దేశముఖ్ తమ వంతు సాయం అందించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు వీరిద్దరూ కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం అందించారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను స్వయంగా కలిసి చెక్‌ను అందజేశారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫోటోను షేర్ చేసారు. దీనికి రితేష్ స్పందిస్తూ 'వరదల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. వారి ఫోటోలు, వీడియోలు చూసి మనసు చలించింది. అందుకే మా వంతు సాయంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రిని కలసి ‘దేశ్‌ ఫౌండేషన్‌’ తరఫున విరాళం అందించాం. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేసి, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నా. మనమంతా కలిస్తే ఎంతో సాధించొచ్చు. థాంక్స్‌ దేవేంద్ర  ఫడ్నవీస్ జీ' అని ట్వీట్ చేసారు.

Tags: genelia flood people maharashtra

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top