logo

చంద్రబాబుపై విజయ సాయి 'ట్విట్టర్ బాణం' ..!


13-Aug-2019 19:52IST
vijayasai reddy sensational comments on chandrababu naidu

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు దేశం మొత్తం తిరిగి అందరిని ఏకం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎవరికీ కనిపించకుండా వెళ్లారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని పదవి నుంచి మోదీని దింపాడమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు, మమతా బెనర్జీ, ఫరూక్ అద్బుల్లాలతో కలిసి పెద్ద ప్లాన్ వేశారు. కానీ చివరకు అందరిని ఆగం చేసారని విజయ్ సాయి అన్నారు. 

ఆ నేతలు వారు ఫోన్లో మాట్లాడదాం అని ప్రయత్నిస్తే వారికీ దొరకడం లేదని ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. మోదీని గద్దె దింపేంత వరకు నిద్ర పోయేది లేదని దేశమంతా తిరిగి అందరినీ ఆగం పట్టించిన చంద్రబాబు కోసం ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే దొరకడం లేదట. అందరినీ రెచ్చగొట్టి తను మాత్రం 370 రద్దుకు మద్ధతు ఇవ్వడంపై నిలదీయాలనుకుంటున్నారట' అంటూ రాసుకొచ్చారు విజయ్ సాయి రెడ్డి.

Tags: vijaya sai reddy chandrababu naidu ysrcp tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top