గూగుల్ ఎప్పుడూ అప్డేటెడ్ అని మరో సారి రుజువైంది. అంతేకాకుండా ఎవరికైనా సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దాని వాళ్ళ గూగుల్ సెర్చ్ లిస్టులు కూడా బాగా పెరిగాయని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. ఈ సంవత్సరానికి గాను గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఇండియన్ సెలెబ్రెటీలలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది సన్నీ లియోన్. ఈ సంవత్సరానికి అత్యధిక మంది వెతికిన సెలెబ్రెటీలలో మోడీ , సచిన్ , సల్మాన్ కన్నా ముందుంది సన్నీ లిస్ట్.
గూగుల్ ఎనలిటికల్ లిస్ట్ ప్రకారం.. చాలా మంది సన్నీ కి సంబందించిన ఫోటోలను, వీడియోలను, ఆమె జీవిత విశేషాల గురించి అలాగే ఆమె బయోపిక్ సిరీస్ 'కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోనీ', సన్నీ కుటుంబీకుల గురించే నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట. ఈ విషయం పై స్పందించిన సన్నీ మాట్లాడుతూ .. గూగుల్ లో నా గురించి చాలా వెతికారని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా వాళ్లకు నా మీదున్న అభిమానం అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం సన్నీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె 'కోకాకోలా' అనే సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర ప్రదేశ్ లో ఉంది.