logo

మూడు చెట్లు నరికినందుకు రూ.39000 జరిమానా..!


13-Aug-2019 20:11IST
39000 fine for chopping down three trees

హైదరాబాద్‌: భావి తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణా ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి నడుం బిగించింది. అందుకోసం పల్లె, పట్నం అనే భేదాలు లేకుండా నవ తరానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చెట్ల సంరక్షణపై ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. పెరుగుతున్న వాహనాలు.. దానికి తోడు కాలుష్యం లాంటివి భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ క్రమంలో చెట్లను సంరక్షించడంతో పాటు మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ తగిన చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉండగా అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మాణాన్ని కొనసాగిస్తున్న ఓ యజమాని, పనులకు అడ్డుగా ఉన్నాయని మూడు చెట్లను అడ్డంగా నరికించేశారు. దాంతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో మూడు చెట్లు నరికినట్టు తేలడంతో భవన యజమానికి రూ.39060లు జరిమానా విధించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. 

Tags: builder 39 000 rs fine cutting three trees

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top