logo

మహా వృక్షానికి రాఖీ కట్టిన విద్యార్థినిలు..!


13-Aug-2019 20:43IST
raakhi pournami specials focus

రాఖీ అంటే అన్న,చెల్లెల బంధాన్ని మరింత గట్టిబరుస్తుందని అందరు నమ్ముతారు. అందుకే, ఈ రాఖి పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు అన్నకు రాఖీ కడతారు.కానీ ఎక్కడ ఒక విచిత్రం జరిగింది. చెట్టును కూడా అన్నలు భావించి రాఖీ కట్టారట. వివరాల్లోకి వెళితే.. విశాఖలో 'గ్రీన్  క్లైమేట్' ఆధ్వర్యంలో విద్యార్థినులు 125 ఏళ్ల చరిత్ర కలిగిన భారీ వృక్షానికి రాఖీ కట్టి సమాజ హితాన్ని చాటి చెప్పారు. మానవ మనుగడకు దోహదపడుతున్న వృక్షాలను తమ తోబొట్టువుగా భావించాలని విద్యార్థినీలు ప్రపంచానికి చాటి చెప్పారు. 

ఈ సందర్బంగా కుటుంబంలో అన్నదమ్ములకు ఎంత ప్రాధాన్యత ఉందో పర్యావరణ పరిరక్షణలో వృక్షాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని సమాజానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ నిర్వాహకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. "గ్రీన్  క్లైమేట్" తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags: raksha bandhan special story

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top