logo

'సితార' డాన్స్ కి ఫిదా అవుతున్న నెటిజన్లు..


13-Aug-2019 21:04IST
mahesh daughter amazing dance

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు  సితార సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి a&s యూట్యూబ్ ఛానెల్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. మహేష్ తనయుడు గౌతమ్ చాలా సైలెంట్ కాబట్టి ఎప్పుడు మీడియా లో కనిపించడు . కానీ సీతూ పాప చాలా యాక్టివ్. సితార చేసే అల్లరి.. సితార ఆటపాటలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడూ మహేష్ లేదా నమ్రత సోషల్ మీడియాలో, అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. 

తాజాగా సితార మహర్షి సినిమాలోని ‘పాలపిట్ట’ పాటకు డ్యాన్స్‌ చేసింది. వివరాల్లోకి వెళితే.. సితూ పాపా డాన్స్ చేసిన  వీడియోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ "నువ్వెంత ముద్దుస్తున్నావో.. రోజు నా పెదవి పై నిలిచే చిరునవ్వుకు నువ్వే కారణం" అంటూ రాశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. సితార డాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వావ్ సితార సూపర్ . తండ్రికి తగ్గ తనయ, యాక్టింగ్ రక్తంలోనే ఉంది,ఎంత క్యూట్ గా డాన్స్ చేస్తుంది అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. మరి ఫ్యూచర్ లో సితార  మహేష్ వారసురాలిగా హీరోయిన్ గా  తెరంగేట్రం చేస్తుందేమో చూడాలి.. 

Tags: mahesh babu sitara dance video

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top