logo

కేటీఆర్‌ ఫై విరుచుకుపడ్డ దత్తన్న!


13-Aug-2019 21:09IST
dattatreya fired on ktr comments regarding article 370

ఎప్పుడూ  సైలెంట్ గా కనిపించే బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ .. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఫై విరుచుకుపడ్డారు.  జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెడుతూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ బలపడడాన్ని జీర్ణించుకోలేని కేటీఆర్‌, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని దత్తన్న సూచించారు. తెలంగాణాలో నెలకొన్న సమస్యలని గాలికొదిలేసి తండ్రి కొడుకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370రద్దుకు మతం రంగు పులమడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జమ్మూకాశ్మీర్ ప్రజల అభీష్టం మేరకే ఆర్టికల్ 370రద్దు జరిగిందని అయన అన్నారు. 

మజ్లీస్ కు బయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోలేని హీన స్థితికి తెరాస దిగజారిపోయిందని అయన  అన్నారు. ఆగష్టు15న జాతీయ జెండాను ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలని ఆయన డిమాండ్ చేసారు. రైతు రుణమాఫీకి నిధులు మంజూరు చేయలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నా, రైతులు మాత్రం నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రూ.80 వేల కోట్లు ఖర్చు చేసి, ఒక్క ఎకరాకు కూడా నీరందించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. 

Tags: dattatreya fired ktr comments regarding article 370

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top