logo

బెయిల్ ఫై విడుదలైన రాపాక


13-Aug-2019 21:33IST
janasena mla  released on  station bail

ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బెయిల్ ఫై విడుదలయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న రాపాక ఈ ఉదయం ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్ సమక్షంలో లొంగిపోయారు. ఈ క్రమంలో రాపాకకు కస్టడీ విధించే నిమిత్తం రాజోలు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరిచారు. 

కాగా రాపాక ఎమ్మెల్యే కావడంతో ఆయనకు కస్టడీ విధించేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. ఓ ఎమ్మెల్యేను అరెస్టు చేసే విధానం ఇది కాదని పోలీసులను సున్నితంగా మందలించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు తీసుకెళ్లాలని పోలీసులకు సూచించారు. అంతే కాకుండా రాపాకకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని ఆదేశించడంతో పోలీసులు ఆయనను విడుదల చేసారు. 

Tags: janasena mla released station bail

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top