logo

తార స్థాయికి చేరిన వెండి ధర..!


13-Aug-2019 21:33IST
star price of silver

సాధారంగా బంగారం అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉండరేమో... ఈ మధ్య కాలంలో వెండికి కూడా అంతే గిరాకీ ఏర్పడింది. దానితో మన తెలుగింటి ఆడపడుచులు బంగారు షాపులలో దర్శనమిస్తుంటారు. ఇక విషయానికొస్తే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మరింది.  ఇదిలా ఉండగా మంగళవారం ఒక్క రోజే రూ. 2000 పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 45,000కు చేరినట్లు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ వెల్లడించింది. అటు బంగారం ధర నేడు స్వల్పంగా దిగొచ్చింది. రూ. 100 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పసిడి ధర రూ. 38,370గా ఉంది. ఈ నేపధ్యంలో అంతర్జాతీయంగానూ వీటి ధరలు పెరిగాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం 1,520.37 డాలర్లు, ఔన్సు వెండి 17.32 డాలర్లు పలికింది. ఇటీవల బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Tags: silver 2000rs increasing today

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top