logo

చైనాలో రికార్డ్ బ్రేక్ చేసిన ఇండియా మూవీ..


13-Aug-2019 21:38IST
chaina record breaks india movie

తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజిని కాంత్ , రోబో సృష్టికర్త శంకర్ క్రేజ్య్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రోబో.. ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా మంచి మార్కులను కూడా కొట్టేసింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో సీక్వెల్ సినిమా గా రోబో 2.o సినిమాను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చాడు డైరెక్టర్ శంకర్. విషయానికొస్తే ఈ సినిమా చైనాలో ఒక ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా రికార్డులను కూడా బ్రేక్ చేసింది. దీనితూ సెప్టెంబర్ 6 న ఆ దేశంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై చిత్రం విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి భారత సినిమా గా 2.o సరికొత్త రికార్డులను బ్రేక్ చేసింది. 

వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను గత నెల 12 న రిలీజ్ చేయాలనుకున్న కూడా ఆ రోజున 'ది లయన్‌ కింగ్‌'  సినిమా రిలీజ్ కాబోతుండటంతో ఈ సినిమామ్ వచ్చే  నెల 6 వ తేదికి వాయిదా వేసారి ఆ చిత్ర యూనిట్. ప్రముఖ నటులు నటించిన ఈ సినిమా దాదాపుగా 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక అనుకున్నంత రాణించక పోయిన కూడా 800 కోట్లకు పైగా గ్రాస్ ను క్రాస్ చేసింది. మరి చైనాలో ఏ మాత్రం వసూళ్లను రాబడుతుందో చూడాలి..

Tags: rajinikanth robo 2.0 record breaks

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top