logo

కుందూ నది ప్రాంతంలో దారుణం


13-Aug-2019 21:39IST
one die and three people missing in the kundu river area

కడప: నది వద్ద సరదాగా గడపడానికి వచ్చిన నలుగురు వ్యక్తులు వరద ప్రవాహంలో గల్లంతైన సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కమలాపురం దర్గా వీధికి చెందిన జాఫర్‌ హుస్సేన్‌(42), చిన్నారులు ఇర్ఫాన్‌ (12), జకీర్‌ (12), షాహీద్‌ (10) వారి కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే వారంతా కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజనాలు చేసి సరదాగా గడిపారు. సాయంత్రం అవుతుండడంతో  పిల్లలు నది తీరానికి వెళ్లి ఆడుకుంటున్నారు. అదే సమయంలో శ్రీశైలం నుంచి కుందూ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో సాయంత్రం వేళ నదిలో ప్రవాహం ఉద్ధృతంగా మారింది. ఈ క్రమంలో సరదాగా ఆడుకుంటున్న వారు ఒక్కసారిగా వరదలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో జాఫర్‌ హుస్సేన్‌ మృతదేహం లభ్యమైంది. మిగిలిన వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాడు.

Tags: one die three people missing kundu river area

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top