logo

తెలంగాణకు 50వేలు ఫైన్ విధించిన సుప్రీమ్


13-Aug-2019 21:51IST
supreme court imposed 50 thousand fine to telangana

ప్రతి రాష్ట్రంలోనూ మానవ హక్కుల న్యాయస్థానం ఏర్పాటు చేయాలనే అంశంపై రాష్ట్రాలు తమ అభిప్రాయాన్నితెలియజేయాలన్న సుప్రీమ్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినందుకు గాను తెలంగాణతో సహా 7 రాష్ట్రాలకు దేశ అత్యున్నత న్యాయస్థానం లక్ష రూపాయల వరకు జరిమానా విధించింది. 2018 జనవరి 4న సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినా, ఇప్పటివరకు స్పందించని రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం జరిమానా విధించింది.

మానవ హక్కుల న్యాయస్థానాల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్​ ప్రాసిక్యూటర్ల​ నియామకంపై నేడు సుప్రీం ధర్మాసనం విచారించింది. 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పకపోవడంతో ధర్మాసనం ఈ మేరకు చర్యలు చేపట్టింది. కేసు విషయంలో అలసత్వం వహించడం, కనీసం విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాాదులను కూడా హాజరుపర్చని రాజస్థాన్​, ఉత్తరాఖండ్​ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా పడింది. తెలంగాణ, ఉత్తర్​ప్రదేశ్, ఒడిశా, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలకు తలా రూ. 50 వేలు జరిమానా విధించింది సుప్రీమ్ కోర్ట్. ఈ 7 రాష్ట్రాలు తమ అభిప్రాయాలను 4 వారాలలోపు సమర్పించాలని, తదుపరి విచారణను 6 వారాలు వాయిదా వేసింది.

Tags: supreme court imposed 50 thousand fine telangana

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top