logo

ప్రజల్లో మరింత చైతన్యం కోసం స్వచ్ సర్వేక్షన్ 2019


14-Aug-2019 15:52IST
swatch sarvekhsan grameen 2019 launched by gajendra singh

గ్రామీణ ప్రాంతాలలో, జిల్లాలో, రాష్ట్రాల్లో పారిశుధ్య విలువలను మెరుగు పరచాడని కేంద్రం మరోసారి కంకణం కట్టుకుంది. దేశంలోని అతిపెద్ద పారిశుధ్య సర్వే- స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ్- 2019 ను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ప్రారంభించారు. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించబోతున్న ఈ సర్వేలో 700 జిల్లాలు, 17,475 గ్రామాలు ఉంటాయి. 2018లో 6,000 గ్రామాల్లో స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ్ పరిధిలో ఉండగా..2019లో అది మూడింతలు పెరగనుందని చెప్పారు. ఈ సారి 2018లో కంటే మూడు రెట్లు పెద్ద ఎత్తున జరపడం విశేషణంగా నిలిచింది. 45 రోజులపాటు 87,000 బహిరంగ ప్రదేశాలలో కొనసాగే ఈ సర్వే సెప్టెంబర్ 30న ముగుస్తుందని మంత్రి గజేంద్ర సింగ్ తెలిపారు. 

భారత్ ను మెరుగైన పారిశుద్ధ దేశంగా మార్చడానికి, ప్రజలలో చైతన్యం తీసుకురావాలనె  ఉద్దేశ్యంతో ఈ సర్వే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ సర్వేపై మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ ప్రజలు ఇచ్చేఅభిప్రాయాలను బట్టి ఆయా జిల్లాలకు, రాష్ట్రాలకు ర్యాంక్ కూడా ఇస్తామని తెలిపారు.

Tags: swatch sarvekhsan grameen 2019 launched gajendra singh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top