logo

శంషాబాద్ 'ఎయిర్ పోర్ట్'లో హై అలర్ట్ ..!


14-Aug-2019 16:17IST
high alert in samshabad airport

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నుండి ఆగస్టు 20వ తేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో దేశ వ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్, ఆక్టోపష్ బృందాలు ఎయిర్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టాయి. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ అధికారులు, ఎయిర్ పోర్ట్ లోకి సందర్శకుల అనుమతిని నిరాకరించి అన్ని రకాల పాసులను రద్దు చేశారు. ఎయిర్ పోర్ట్ లోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. 

Tags: high alert samshabad airport

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top