logo

హైదరాబాద్ లోని జీడిమెట్ల లో దారుణ హత్య


14-Aug-2019 19:05IST
murder in hyderabad

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని గాజులరామారంలో సునీల్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాలాజీ లేఔట్ లోని ఇన్ ఫ్రా జెవెల్ గ్రాండ్ అపార్ట్ మెంట్ లో ఈ హత్య జరిగింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం హతుడు సునీల్ కి సూర్యనారాయణ అనే వ్యక్తితో గతంలో పరిచయం ఉండేది. దాన్ని అదునుగా తీసుకున్న సునీల్ సూర్యనారాయణ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న సూర్యనారాయణ.. సునీల్ ను చాలా సార్లు మందలించాడు. 

వీటన్నిటిని పట్టించుకోని సునీల్.. సూర్యనారాయణ భార్య ను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. సూర్యనారాయణ  ఇంట్లో లేని సమయంలో సునీల్ పలుమార్లు తన భార్య వద్దకు రావడం గమనించిన సూర్యనారాయణ కాపు కాసి, మరో ఇద్దరి సహాయంతో సునీల్ ఫై కర్రలతో దాడి చేసి హతమార్చాడు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని సునీల్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, బాలానగర్ ఏసీపీ ఆద్వర్యంలో ఈ హత్య ఫై దర్యాప్తు జరుగుతోంది.
 

Tags: murder hyderabad jeedimetla

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top